తన కుమారుడి చావుకు చక్రధర్ కారణం ఆయన తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇవ్వలేదని మంజునాథరెడ్డి తండ్రి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇదిలావుంటే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో మంజునాథరెడ్డి పోస్టుమార్టం పూర్తికాగా.. డెడ్‌బాడీ అన్నమయ్య జిల్లాకు తరలించారు. వ్యాపార లావాదేవీల్లో సమస్యల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. వ్యాపార భాగస్వామి చక్రధర్ మోసం చేశాడని మంజునాథ్ తండ్రి ఆరోపించారు. సహస్త్ర కంపెనీలో పార్ట్‌నర్‌షిప్ పేరుతో మోసం చేశారని.. రూ.కోట్ల బిల్లులు రాకుండా కాంట్రాక్టర్ చక్రధర్ అడ్డుకున్నారన్నారు. ఒత్తిడిలోనే మంజునాథ్ ఆత్మహత్య చేసుకున్నారని.. తన కుమారుడి చావుకు చక్రధర్ కారణం ఆయన తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇవ్వలేదన్నారు.
మంజునాథరెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాటులో.. శుక్రవారం రాత్రి శవమై కనిపించారు. ముందు అందరూ అనుమానాస్పద మరణంగా భావించారు.. కానీ తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మంజునాథరెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లెకాగా.. ఆయన తండ్రి మహేశ్వర్‌రెడ్డి పీఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ యజమాని. ఆయన వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు.