ప్రఖ్యాత చిత్రనిర్మాత శేఖర్ కమ్ముల తన తాజా చిత్రం 'కుబేర' తో బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించాడు. ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ ధనుష్, నాగార్జున మరియు రష్మిక మాండన్న ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో జిమ్ సర్బ్ విరోధిగా నటించారు. ఈ చిత్రంలో సయాజీ షిండే, సున్నైనా, దలీప్ తహిల్, హరీష్ పెరాడి మరియు శ్రావణీ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో అక్టోబర్ 5న సాయంత్రం 5:30 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన సౌండ్‌ట్రాక్ మరియు నేపథ్య స్కోర్ ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa