రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన 'జూనియర్' లో కిరీటి ప్రధాన పాత్రలో నటించారు. ఈ యూత్ ప్రేమకథ చిత్రంలో కిరీటి సరసన జోడిగా శ్రీలీల నటిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు డిజిటల్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రం కన్నడ మరియు తెలుగుతో సహా పలు భాషలలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది. రజనీ కొర్రాపతి నిర్మించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్, వైవా హర్ష మరియు జెనీలియా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa