మౌలి తనుజ్ ప్రశాంత్ మరియు శివానీ నాగరం ప్రధాన పాత్రలో నటించిన 'లిటిల్ హార్ట్స్' బాక్స్ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సూపర్-హిట్ రొమాంటిక్ కామెడీ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. లిటిల్ హార్ట్స్ ఎక్స్టెండెడ్ కట్‌లో లభిస్తుందని ఈటీవీ విన్ ప్రకటించింది. ఇందులో థియేట్రికల్ విడుదలలో భాగం కాని దృశ్యాలు ఉన్నాయి. ఈ చిత్రంలో జై కృష్ణ, నిఖిల్ అబ్బూరి, రాజీవ్ కనకాలా, అనిత చౌదరీ, సత్య కృష్ణన్, ఎస్ఎస్ కాంచీ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య హసన్ నిర్మించగా, సింజిత్ యిరామిల్లి సంగీతాన్ని అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa