కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మరియు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం కాంతారా: చాప్టర్ 1 అక్టోబర్ 2, 2025న బహుళ భాషలలో భారీ విడుదల కోసం సిద్ధమవుతోంది. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. హోంబేల్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, అజనీష్ లోక్నాథ్ సంగీత స్వరకర్తగా ఉన్నారు. శాండల్వుడ్ బ్యూటీ రుక్మిని వాసంత్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య విలన్ పాత్రలో, జయ రామ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa