టాలీవుడ్‌లో మరో స్టార్ హీరో, మెగా కుటుంబానికి చెందిన యువ హీరో అల్లు శిరీష్ తన ప్రేయసి నైనికా చేతిని పట్టుకొని ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద నిశ్చితార్థం చేసుకున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 1 తన తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇటీవల తన నానమ్మ మరణించగా.. ఆమె కోరిక మేరకు పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపారు. నైనికా హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. వీరి పెళ్లి ఎప్పుడవుతుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa