బహుముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన మరియు నటించిన తమిళ డ్రామా చిత్రం 'ఇడ్లి కడై' అక్టోబర్ 1, 2025న తెలుగులో కూడా "ఇడ్లీ కోటు" అనే టైటిల్ తో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్నట్లు సామాచారం. నిత్య మీనన్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అరుణ్ విజయ్ విరోధిగా నటించాడు. రాజ్ కిరణ్, పార్థిబాన్, షాలిని పండేయ్ మరియు సత్యరాజ్ ఈ సినిమాలో సహాయక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. వండర్‌బార్ ఫిల్మ్స్ మరియు డాన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa