పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన లూసిఫెర్ త్రయం ఎల్ 2: ఎంప్యూరాన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా లో పృథ్వీరాజ్ సుకుమారన్, అభిమన్యు సింగ్, టోవినో థామస్, మంజు వారియర్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ చిత్రం వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఇటీవలే టెలికాస్ట్ 1.41 టీఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం. ఎల్ 2 ఎంప్యూరాన్ 2019 హిట్ లూసిఫర్‌కు సీక్వెల్. ఆశీర్వాద్ సినిమాస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై ఆంటోని పెరుంబవూర్ మరియు అల్లిరాజా సుభాస్కరన్ సంయుక్తంగా ఎల్ 2 ఎంపురాన్ చిత్రాన్ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa