హనుమాన్ యొక్క అద్భుత విజయం తరువాత చిత్రనిర్మాత ప్రశాంత్ వర్మ తన సినీ విశ్వాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాడు. హను-మాన్ యొక్క భారీ విజయాన్ని అనుసరించి అందరి దృష్టి చిత్రం యొక్క సీక్వెల్ 'జై హను-మాన్' పైనే ఉంది. ఇది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగం. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ చేయబడింది మరియు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు, ప్రధాన తారాగణం గురించి వివరాలు ప్రకటించబడలేదు. మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హనుమంతుడిగా పురాణ పాత్రను పోషించబోతున్నాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ డిసెంబర్ 2025లో ప్రారంభించటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa