ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని లాక్ చేసిన 'శంబాల'

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 05:57 PM

టాలీవుడ్ నటుడు ఆది సాయికుమార్ రాబోయే మిస్టికల్ థ్రిల్లర్ 'శంభాల' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మూవీ పై భారీ బజ్ ని సృష్టించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని చిత్ర బృందం డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో స్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధు నందన్, శివ కార్తీక్, ఇంద్ర అనిల్, శైలజ ప్రియా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హన్స్ జిమ్మర్ వంటి ప్రముఖ హాలీవుడ్ కంపోజర్లతో పనిచేసిన శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందించారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా షూనింగ్ పిక్చర్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa