ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంయుక్త కొత్త చిత్రానికి క్రేజీ టైటిల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 20, 2025, 09:07 AM

ప్రముఖ నటి సంయుక్త  తదుపరి బాలకృష్ణ సరసన 'అఖండ 2' లో కనిపించనుంది. టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన హాస్య మూవీస్ బ్యానర్‌పై ఆమె ఒక చిత్రంలో కూడా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి అధికారికంగా 'ది బ్లాక్ గోల్డ్' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఆమె పోలీసుగా కనిపించనుంది. దీపావళి స్పెషల్‌గా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చేసారు. యోగేష్ కెఎంసి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa