దర్శకుడు మెర్లాపాకా గాంధీతో టాలీవుడ్ నటుడు మెగా హీరో వరుణ్ తేజ్ ఒక హర్రర్-కామెడీ చిత్రం కోసం జతకట్టారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా కొరియన్ కనకరాజు (విటి 15) అని టైటిల్ ని పెట్టారు. ఈ చిత్రంలో రితిక నాయక్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సత్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి స్వింగ్‌లో ఉంది. ఈ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్న రితిక నాయక్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సహకారంతో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ ఇండో-కొరియన్ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa