ప్రముఖ నటి మీనాక్షి చౌదరి, అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ 'ఇచట వాహనములు నిలుపరాదు' చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది ప్రేమగా మారిందని అంటున్నారు. ఇటీవల ఒక ప్రైవేట్ పార్టీలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు బలనిచ్చినట్లయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa