యంగ్ హీరో విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా 'రౌడీ జనార్ధన్' చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడతాడని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, విజయ్ కెరీర్‌లో ఇంతవరకు పోషించని ఒక విభిన్నమైన పాత్రలో ఈ చిత్రంలో కనపడతాడని అన్నారు.అంతేకాకుండా, ఇందులో విజయ్ పూర్తిస్థాయి మాస్ పాత్రను పోషిస్తున్నాడని పేర్కొన్నారు. ఇది 80వ దశకం నాటి కథాంశంతో రూపొందుతోందని తెలిపారు. 2026లో తమ నిర్మాణ సంస్థ నుంచి 6 సినిమాలు విడుదల కానున్నాయని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa