మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం తిరుపతిలో విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, తిరుపతి అంటే సెంటిమెంట్ అని, ఏ సినిమా మొదలుపెట్టినా, విడుదలైనా ఇక్కడికే వస్తానని, వెంకటేశ్వరస్వామి దయవల్ల కెరీర్ బాగుందని తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ రెండున్నర నిమిషాల నిడివి మాత్రమేనని, థియేటర్‌లో రెండున్నర గంటలకుపైగా సినిమా ఉంటుందని, టైమ్ మెషీన్‌లో రౌండ్ వేసి వింటేజ్ చిరంజీవిని చూసి వస్తారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa