నటి రాశికి, అనసూయ భరద్వాజ్ క్షమాపణలు చెప్పారు. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన నేపథ్యంలో, రాశి ఇటీవల విడుదల చేసిన వీడియోపై అనసూయ స్పందించారు. ఆ వీడియోలో రాశి, కొన్నాళ్ల క్రితం ఓ టీవీ కార్యక్రమంలో అనసూయ తనను కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా అనసూయ ఒక నోట్ విడుదల చేసి, రాశికి క్షమాపణలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa