మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై భారీ విజయం సాధించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అనూహ్యంగా కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని, నిర్మాతలకు లాభాల బాట పట్టించింది.ఈ సినిమా ఓటీటీ విడుదలలో ఒక ప్రత్యేకత ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ ఒకేసారి అందుబాటులోకి రానుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ చిత్రాన్ని తమ భాషల్లో వీక్షించే అవకాశం లభించనుంది.థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు, మరోసారి చూడాలనుకునే అభిమానులు ఈ ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa