ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమికుల రోజున 'మనసంతా నువ్వే' రీ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 02:38 PM

ఉదయ్ కిరణ్, రీమాసేన్, తనూరాయ్ నటించిన 'మనసంతా నువ్వే' సినిమా ప్రేమికుల రోజున, అంటే ఈ నెల 14న, తిరిగి థియేటర్లలో విడుదల కానుంది. 25 ఏళ్ల క్రితం విడుదలై ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఎం.ఎస్. రాజు నిర్మించారు. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి, చైతన్యారెడ్డి, శ్రీ మాత క్రియేషన్స్ రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి రీ రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో 250 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సినిమా, ఇప్పటి యువతను కూడా ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.2001 లో విడుదలై ఘనవిజయం అందుకున్న ఈ సినిమా (Movie) ఇప్పటికీ 90స్ కిడ్స్ కి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఈ సినిమాను ఇష్టపడని ప్రేక్షకుడు దాదాపు లేరనే చెప్పాలి. ఉదయ్ కిరణ్ హీరోగా, రీమాసేన్, తనూ రాయ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో ప్రేమ, భావోద్వేగం, త్యాగం వంటి అంశాలను చాలా చక్కగా ఆవిష్కరించిన దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో భారీ సంచలనం సృష్టించి ఊహించని కలెక్షన్లను కూడా రాబట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa