ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరిట్’ నుంచి తాజాగా ఓ కీలక వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి ఐపీఎస్ పాత్రలో నటిస్తున్నాడన్న టాక్‌తో ఈ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో ప్రభాస్ - ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలతో షూటింగ్ కూడా మొదలైందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అన్నది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. గతంలో విడుదలైన వాయిస్ టీజర్ ద్వారా ప్రకాశ్ రాజ్ పాత్రకు సినిమాలో కీలక ప్రాధాన్యం ఉంటుందని అభిమానులు భావించారు. ఈ నేపథ్యంలో ఆయన తప్పుకున్నారనే వార్త నిజమైతే మూవీపై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ వదంతులపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa