ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల‌ 14న 'పెద్ది' నుండి మరోపాట

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 02:53 PM

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది'పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా నుంచి రాబోయే ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి పాట 'చికిరి చికిరి' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదలకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం 'పెద్ది' రెండో పాటను ప్రేమికుల దినోత్సవం (వాలంటైన్స్ డే) సందర్భంగా ఈ నెల‌ 14న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ పాట రామ్‌చరణ్ క్యారెక్టర్‌ను పరిచయం చేసే పవర్‌ఫుల్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా ఉండబోతోందని సమాచారం. చరణ్ మాస్ ఎనర్జీని, పాత్ర స్వభావాన్ని గ్రాండ్‌గా ఎలివేట్ చేసేలా ఈ గీతాన్ని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచినట్లు తెలుస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa