ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్-నమ్రత జోడీపై అనుపమ పరమేశ్వరన్ వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 02:49 PM

రోమియో-జూలియెట్, రాధా-కృష్ణుల ప్రేమ కథలతో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల జోడీని క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పోల్చడం ఆసక్తికరంగా మారింది. ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, పాపులర్ కపుల్స్ గురించి చెబుతూ మహేష్-నమ్రతల పేరును మూడవ జంటగా పేర్కొంది. మ‌హేష్‌తో క‌లిసి అనుప‌మ ఇంత వ‌ర‌కు ఏ సినిమా చేయ‌లేదు. భ‌వ‌ష్య‌త్తులో ఆ అవ‌కాశం రావాల‌ని అలా మ‌హేష్ జంట‌ని మెన్ష‌న్ చేసిందో లేక యాక్సిడెంట‌ల్‌గా చెప్పిందో కానీ ఇప్పుడా వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇదిలా ఉంటే చేజేతులా పోగొట్టుకున్న క్రేజీ అవ‌కాశం మ‌ళ్లీ అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను వెతుక్కుంటూ వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. వివారాల్లోకి వెళితే..గ‌త కొన్నేళ్ల క్రితం గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, లెక్క‌ల మాస్టారు సుకుమార్‌ల కల‌యిక‌లో తెర‌కెక్కిన మూవీ `రంగ‌స్థ‌లం`. ఇందులో స‌మంత హీరోయిన్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa