ట్రెండింగ్
Epaper    English    தமிழ்

60 ఏళ్ల జగపతి బాబు ఫిట్‌నెస్ రహస్యం ఇదే!

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 07:16 PM

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన జగపతి బాబు, ఇప్పుడు స్టైలిష్ విలన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 60 ఏళ్లు దాటినా ఆయన ఫిట్‌గా ఉండటానికి గల సిక్రెట్ ను పంచుకున్నారు. ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్లే ఇది సాధ్యమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, ప్రస్తుత క్షణంలో జీవించడమే తన ఫిట్‌నెస్ రహస్యమని  తెలిపారు.  ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న జగపతి బాబు కెరీర్‌లో, ఒకానోక దశ తర్వాత ఆయన ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నిజానికి ‘లెజెండ్’ సినిమాతో ఆయన విలన్‌గా మారడం తన జీవితంలో అతిపెద్ద మలుపుగా జగపతి బాబు చెబుతుంటారు. హీరోగా ఉన్నప్పుడు రాని గుర్తింపు, విలన్‌గా మారిన తర్వాత విభిన్న పాత్రల ద్వారా లభిస్తోందని ఆయన పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ స్టైలిష్ విలన్ తన సెకండ్ ఇన్సింగ్స్‌లో సూపర్ హిట్స్ రోల్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa