ఫౌజీ' షూటింగ్‌లో ప్రమాదం.. ప్రభాస్‌కు గాయం. పాన్ ఇండియా హీరో ప్రభాస్ మూవీ షూటింగ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ సెట్స్‌లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మూవీలో భాగంగా కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్ కిందపడిపోయారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఆయన చేతికి గాయమైందని సోషల్‌మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే, అభిమానులు కంగారుపడాల్సిన పనిలేదని గాయం చిన్నదేనని తెలుపుతున్నారు. ఈ విషయంపై సినిమా యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన ఇవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు.