ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ అధికారి పాత్ర కోసం 14 సంవత్సరాలు పెంచిన గడ్డాన్ని తీసేసిన అయ్యప్ప శర్మ

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 12:54 PM

నటుడు అయ్యప్ప శర్మ (సాయికుమార్ సోదరుడు) తన సరికొత్త మేకోవర్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. సుమారు 14 సంవత్సరాలుగా పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ఒకే రకమైన లుక్‌లో కనిపించిన ఆయన, తాజాగా క్లీన్ షేవ్‌తో దర్శనమిచ్చారు. కన్నడలో తెరకెక్కుతున్న 'పబ్బార్' అనే సినిమా కోసం ఆయన తన సిగ్నేచర్ స్టైల్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఈ చిత్రంలో అయ్యప్ప శర్మ ఒక పవర్‌ఫుల్ పోలీస్ అధికారి (ఎస్పీ) పాత్రను పోషిస్తున్నారు.గత దశాబ్ద కాలంగా విలన్ పాత్రలకు అయ్యప్ప శర్మ పెట్టింది పేరు. ముఖ్యంగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాల్లో ఆయన నటనకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. తన గంభీరమైన కంఠంతో, కళ్లలోని తీక్షణతతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. 'కేజీఎఫ్' లాంటి పాన్-ఇండియా చిత్రంలోనూ తనదైన ముద్ర వేశారు. అలాంటి నటుడు ఒక పాత్ర కోసం తన ఇమేజ్‌ను పక్కనపెట్టి, ఇలా కొత్తగా కనిపించడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం అయ్యప్ప శర్మ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa