మాస్ మహారాజ్ రవితేజ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 13 నుంచి G5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓటీటీ ప్రేక్షకుల కోసం G5 ప్రత్యేక ట్రైలర్ను కూడా విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa