పెద్ద హీరోల సినిమాల మధ్య కలెక్షన్ల యుద్దం ఎప్పటి నుంచో నడుస్తున్నదే అయినా అది ఈమధ్య మరీ ఎక్కువైంది. సోషల్ మీడియా వినియోగం ఎక్కువవడంతో ఫ్యాన్స్ ఈ వసూళ్ల అంశాన్ని నెట్టింట్లో పెట్టి బాహాబాహీకి దిగుతున్నారు. ఇక నిర్మాతలు సైతం ఫస్ట్ డే రికార్ఫ్, సెకండ్ డే రికార్డ్స్ అంటూ ఎప్పటికప్పుడు పోస్టర్లు వదులుతూ అభిమానుల్ని గిలిగింతలు పెట్టేవారు. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రామ్ చరణ్ తన సినిమాల విషయంలో ఇకపై ఇలా వసూళ్లను పోస్టర్లలో ఉంచవద్దని తన నిర్మాతలను రిక్వెస్ట్ చేయడమే కాక తాను నిర్మించే సినిమాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటానని ప్రకటించారు. ఆ మాటను తన తండ్రి చిరుతో నిర్మించిన ‘సైరా’ విషయంలో అమలు చేస్తున్నారు. చిత్రం మొదటి రోజు రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టినా, తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నా వాటి వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. హిస్టారిక్ బ్లాక్ బస్టర్ అనే పోస్టర్ తప్ప కలెక్షన్లను ముద్రించలేదు. సో.. మొత్తానికి చెర్రీ ఇతర నిర్మాతలను పాటించమని చెప్పిన నియమాన్ని ముందుగా తానే పాటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa