ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజా పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2019, 01:10 PM

శ్రీరెడ్డి..ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న డైరెక్టర్ సి.సుందర్, మురగదాస్, రాఘవ లారెన్స్ వంటి వాళ్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి తమిళ తంబీల వెన్నులో వణుకు పుట్టించింది. అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో నాని తనతో పడక సుఖాన్ని పంచుకున్నాడని సంచలన ఆరోపణలు చేసిన వార్తల్లో నిలిచింది. రీసెంట్‌గా బోయపాటి శ్రీను పై సంచలన ఆరోపణలు చేసిన ఈ భామ.. తాజాగా సీనియర్ నటి వైసీపీ ఎమ్మెల్యే రోజాపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.


ఈ బుధవారం నాడు తన సోషల్ మీడియా అకౌంట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఒక టాలీవుడ్ నటితో ఎఫైర్ ఉందంటూ ఆమెపై సంచలన ఆరోపణలు చేసింది. ఆ వేడి చల్లారకముందే.. ఆ నటి భర్తతో రోజాకు ఎఫైర్ ఉందంటూ వివాదాల తుట్టెను కదిల్చింది. రోజాకు నటి ప్రవీణ భర్త అనీల్‌తో ఎఫైర్ ఉండేదని ఆరోపణలు గుప్పించింది. అంతేకాదు రోజు రోజా.. అతడిని డబ్బుల కోసం గోకేదని.. డబ్బున్న వాళ్లను ఎలాగో అలా పరిచయం చేయమని అనీల్‌ను పీడించేదని ఆరోపణలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa