అమెరికాతో యుద్ధాన్ని ముగించడానికి తమకు గట్టి సంకల్పం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. అయితే భవిష్యత్తులో తమపై దాడులు జరగవనే హామీ ఇస్తేనే యుద్ధం విరమిస్తామని తెలిపారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడితో ఫోన్ సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధం ముగింపు దశకు వచ్చిందని, హార్మూజ్ జలసంధిని తెరిపించే ప్రక్రియను వాయిదా వేసి, యుద్ధాన్ని తన గడువులోపు ముగించాలని భావిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa