కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు ప్రభుత్వ అతిథిగృహంలో కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మంత్రికి పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లా పరిస్థితులు, శాంతి భద్రతలపై ఇద్దరి మధ్య సంక్షిప్త చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్ గుప్తా, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa