ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ వాయిదా..కొత్త డేట్ ఇదే

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2019, 03:41 PM

ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యే తేదీ ఖరారైంది. ఈనెల 14న చిరంజీవి.. అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్ ఖరారైనట్టు తెలిసింది. మొదట ఈనెల 11న ఉదయం 11 గంటలకు జగన్‌‌ను కలుస్తారంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే, ఆ అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదంటూ సీఎంఓ తేల్చిచెప్పింది. అయితే, తాజాగా 14వ తేదీన ఖరారైనట్టు తెలిసింది. సైరా నరసింహారెడ్డి సినిమా విజయం సాధించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా పలువురు రాజకీయ ప్రముఖులను కలుస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడి చరితను తెరకెక్కించిన విధానాన్ని వివరిస్తున్నారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కూడా కలిశారు. ఆమె కూడా సినిమాను చూసి మెగాస్టార్‌ను మెచ్చుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా కలవడానికి అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలిసింది. అయితే, ఇంకా అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa