ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జబర్దస్త్ లో ‘సైరా’ స్పూఫ్ తో అదరగొట్టిన హైపర్ ఆది

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2019, 05:09 PM

కొత్త మూవీ వచ్చిందంటే చాలు.. హైపర్ ఆది అందులోకి దూరిపోతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. ముఖ్యంగా మెగా భజన చేయడంలో ఆది తర్వాతే ఎవరైనా..? అక్కడున్న నాగబాబును.. అక్కడ లేని మెగా హీరోలను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. రెండు వారాల కింద గద్దలకొండ గణేష్ పాత్రలో నవ్వించిన ఆది.. ఇప్పుడు ఏకంగా సైరాపై కన్నేసాడు. వచ్చే వారం ఎపిసోడ్‌లో ఉయ్యాలవాడ గెటప్‌లో నవ్వించబోతున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్. ఇప్పటికే విడుదలైన ప్రోమో అదిరిపోయింది. 


దీనికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వచ్చే వారం కూడా సైరాతో ఆది నవ్వులు పూయించడం ఖాయమని అర్థమైపోతుంది. పైగా అందులోనే బాహుబలి, మగధీర లాంటి సినిమాలను కూడా మిక్స్ చేసాడు హైపర్ ఆది. దానికి తనదైన పంచులు తోడు కావడంతో స్కిట్ కడుపులు చెక్కలయ్యేలా సిద్ధమైపోయింది. 2 నిమిషాల ప్రోమోలో గ్యాప్ లేకుండా పంచ్ డైలాగులు వేసాడు ఆది. ప్రోమో చూసిన తర్వాత అభిమానులతో పాటు ఆది ఫాలోయర్స్ కూడా ఈ స్కిట్ కోసం చూస్తున్నారు. మరోవైపు అక్కడే ఉన్న నాగబాబు కూడా సైరా స్పూఫ్ చూసి కడుపు పగిలేలా నవ్వుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa