సిద్ధు ముద్ద అల్లు వెంకటేష్ నిర్మాతలుగా అల్లు అరవింద్ సమర్పణలో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ సంస్థలు ఓ చిత్రానికి శ్రీకారం చుట్టాయి. ఈ చిత్రంలో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైన తొలి సన్నివేశానికి నాగబాబు క్లాప్‌నిచ్చారు. కొణిదెల సురేఖ కెమెరా స్విచ్చాన్ చేయగా అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ కొత్త తరహా కథలతో ప్రయాణం చేసే కథా నాయకుడు వరుణ్‌తేజ్. ఈ కథ ఆయనకు బాగా నచ్చిందని, వినగానే ఓకే చెప్పారన్నారు. ఇందులో ఆయన బాక్సర్‌గా నటిస్తున్నారని, అందుకోసం అమెరికా వెళ్లి ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నారన్నారు. డిసెంబరు నుంచి చిత్రీకరణ మొదలవుతుందని,సినిమాకు తమన్ సంగీతం అందచేస్తారని తెలియచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa