అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్న యంగ్ హ్యాండ్సమ్ హీరో నవదీప్ కొంచెం తేడా అని “గే” అని రూమర్స్ ఆమధ్య బాగా విన్పించాయి. ఎందుకంటే ఆయన అమ్మాయిలకన్నా అబ్బాయిలకు ఎక్కువ ఎట్రాక్ట్ అవ్వడమే. అయితే ఈ మధ్య ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవదీప్ మాట్లాడుతూ “నేను యూఎస్‌లో ఉన్నపుడు ఒకరు నాతో చాట్ చేసారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా తరువాత మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు అన్నాడు. సరే అడగమంటే! మీకు లానే నాకు అబ్బాయిలంటే బాగా ఇష్టం అని అన్నాడు. మీతో చాలా మాట్లాడి, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని ఉందని చాటింగ్ ఆరంభించేసరికి నాకు ఇంటరెస్ట్ లేదు అని బై చెప్పి దండంపెట్టేశా. కేవలం హాస్యం కోసమే సినిమాలో ఆవిధంగా చూపిస్తారే గానీ, అబ్బాయిలు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన గే అనేయటం ఎంతవరకు సబబని మండిపడ్డాడు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa