స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "అల వైకుంఠపురములో". ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్దమవుతోంది. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆ మధ్య విడుదలైన ఓ పాట సంచలనాలకు చిరునామాగా మారింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని సామజవరగమన పాట విడుదలైనప్పటి నుండి యూ ట్యూబ్‌ను షేక్ చేస్తూనే ఉంది. ఈ పాట విడుదలైన మొదటి రెండు రోజులు యూ ట్యూబ్‌లో నెం 1గా ట్రెండింగ్ అవుతూ అదరగొట్టింది. కాగా ఈ పాట మరో రికార్డ్‌ను సృష్టించింది. సామజవరగమన యూట్యూబ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన పాటగా రికార్డ్ సృష్టించింది. ఇదే విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఏ తెలుగు సాంగ్‌కు ఇంత సంఖ్యలో లైక్స్ రాలేదని.. ఇంతకు ముందున్న రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతూ.. రికార్డ్ సృష్టించింది. కాగా ఈ సాంగ్‌కు ఇప్పటికే 41 మిలియన్ వ్యూస్ రాగా.. 700K లైక్స్‌తో ఏ తెలుగు సాంగ్‌కు రాని లైక్స్ తో రికార్డ్ సృష్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa