ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాజు గారి గది 3' సెకండ్ డే కలెక్షన్స్....!

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2019, 08:28 PM

రాజు గారి గది సినిమాతో తెలుగులో హార్రర్ సినిమాలను కొత్త పుంతలు తొక్కించిన ఓంకార్ .. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్స్‌గా రాజు గారి గది2, ..తాజాగా రాజు గారి గది 3 సినిమాతో పలకరించాడు. రాజు గారి గది సినిమాలా ‘రాజు గారి గది 2’ ఓపెనింగ్స్ రాబట్టినా.. ఫైనల్‌గా మాత్రం నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. తాజాగా ఈ సీక్వెల్‌లో మూడో సినిమా ‘రాజు గారి గది 3’ ఈ శుక్రవారం రిలీజైంది.  రొటిన్ కథ అని విమర్శకులు తేల్చిసినా.. మాస్ ప్రేక్షకులు మాాత్రం ఈ సినిమాలో కామెడీకి ఫిదా అయిపోయారు. మాస్ ప్రేక్షకుల్లో రాజు గారి గది సినిమా టైటిల్‌కున్న బ్రాండ్ వాల్యూ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.3 కోట్లను షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1.5 కోట్ల షేర్‌ను రాబట్టింది. మొత్తంగా రూ. 2.6 కోట్ల గ్రాస్‌ను వసూళు చేసింది తొలిరోజు. ఇక రెండో రోజు శనివారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. 2.7 కోట్లతో షేర్.. రూ.4.65 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.5.2 కోట్లకు అమ్ముడుపోయింది. దాంతో బ్రేక్ ఈవెన్ కి రూ.6 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి.  ఈ ఆదివారం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్‌గా ఉండే ఈ మొత్తాన్ని రాబట్టడం పెద్ద విషయం కాదు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa