ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైరా 21 డేస్ కలెక్షన్స్....

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2019, 08:22 PM

సక్సెస్‌ఫుల్‌గా రెండు వారాలు కంప్లీట్ చేసుకొని మూడో వారంలో అడుగుపెట్టింది చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. ఇప్పటికే 21 రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినా.. అమ్మినా రేటు ప్రకారం చాలా చోట్ల ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగులో రూ.100 కోట్ల మార్క్ షేర్‌ను అందుకుంది సైరా నరసింహారెడ్డి. దసరా సెలవులు నైజాంలో ఈ సినిమాకు బాగానే ఉపయోగపడ్డాయి. సెలవుల తర్వాత మాములు పనిదినాల్లో ఈ సినిమా అనుకున్న కలెక్షన్స్ రాబట్టం లేదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మూడవ వారం విజయవంతం అయిన తరువాత  రూ .105.51 కోట్లు కలెక్షన్స్ రాబటింది. 


సైరా ప్రాంతాల వారీగా కలెక్షన్స్:


నిజాం: రూ .32.49 కోట్లు


సీడెడ్ : Rs 19.16 కోట్లు


యుఎ: రూ 16.53 కోట్లు


తూర్పు గోదావరి: రూ .9.15 కో


పశ్చిమ గోదావరి: రూ .6.57 కోట్లు


గుంటూరు: రూ .9.61 కోట్లు


కృష్ణ: రూ .7.48 కోట్లు


నెల్లూరు: రూ. 4.52 కోట్లు


మొత్తం 21 రోజులు సై రా నరసింహ రెడ్డి ఎపి / టిఎస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్: రూ .105.51 కోట్లు షేర్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa