లోకనాయకుడు కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. గతంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. వివిధ దేశాలలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ మూవీలో కమల్ కి జంటగా చేస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఆమె పాత్రపై పరిశ్రమలలో ఆసక్తికర వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే కాజల్ ఈ మూవీలో 85ఏళ్ల వృద్దురాలిగా కనిపించనుందట. కమల్ 90ఏళ్ల వృద్దుడిగా చేస్తున్న క్రమంలో ఆయన భార్యగా కాజల్ వృద్దురాలిగా కనిపిస్తుందట. ఇక వీరిద్దరి ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్స్ లో యంగ్ ఏజ్ లో కనిపిస్తుందని సమాచారం. ఆమె పాత్ర భారతీయుడు 2 చిత్రంలో చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని సమాచారం. మొదటి పార్టులో కమల్ భార్యగా వృద్ధురాలి పాత్రలో సుకన్య నటించారు. ఈ మూవీలో కూడా కమల్ హాసన్ యువకుడిగా, మరియు వృద్దుడిగా రెండు గెటప్స్ లో కనిపించనున్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్,రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని భాస్కర్ సిద్దార్ధ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa