ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సినిమాకి హీరోయిన్లు ఇద్ద‌రా లేక ఒకరా !

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2019, 10:15 PM

తమిళ్ స్టార్ హీరో హీరో విజయ్, అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ తమిళ చిత్రం 'తెరి'. 2016లో విడుదలైన ఈ సినిమాను 'పోలీస్' పేరుతో తెలుగులోరీమేక్ చేసి కూడా విడుదల చేశారు. అయితే, అప్పటికి విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో అస్సలు మార్కెట్ లేదు. ఇక చాలా మందికి ఈ సినిమా గురించి తెలీలేదు. అందుకని, ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అది కూడా మాస్ మహారాజా రవితేజ హీరోగా. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బి. మధు నిర్మిస్తున్నారు. 


ఇకపోతే ఈ సినిమాను తెలుగులో రవితేజకు 66వ చిత్రం.ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు దర్శకుడు గోపీచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'బలుపు' తరవాత రవితేజ, శృతిహాసన్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఆ సినిమాలో 'తెరి'లో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు.తెలుగులో రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరా లేక ఒకరా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa