ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబ కథా చిత్రం మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2017, 12:44 PM

భారీ చిత్రాల తుఫాన్ ముందు చిన్న చిన్న మెరుపులు, ఉరుముల మాదిరిగా చిన్న చిత్రాల జోరు టాలీవుడ్‌లో బాగానే కనిపిస్తున్నది. గత నెల రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వారినికి సుమారు పది చిత్రాలు విడుదల కొంత సందడిని తెచ్చిపెడుతున్నది. ఈ క్రమంలోనే వచ్చిన సినిమా కుటుంబ కథా చిత్రం. కేవలం నాలుగు రాత్రుల్లో సినిమాను రూపొందించడం ఈ చిత్రానికి ఉన్న విశేషం. కాగా టాప్ యాంకర్, నటి శ్రీముఖి, హీరో నందులు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఓ కుటుంబానికి కాపలాగా ఉండే సెక్యూరిటీ రాక్షసుడిగా మారితే వారి జీవితం ఎలా ఉంటుందనే పాయింట్‌తో దాసరి భాస్కర్ యాదవ్ రూపొందించిన చిత్రానికి వీఎస్ వాసు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


కుటుంబ కథా చిత్రం స్టోరీ : చరణ్ (నందు), పల్లవి (శ్రీముఖి) భార్యభర్తలు. ఇద్దరు కూడా ఉద్యోగస్తులు. పల్లవి ఉద్యోగం చేయడం వల్ల అన్యోన్యత ఉండటం లేదు. ప్రేమానురాగాలు దూరమవుతున్నాయి. జీవితం యాంత్రికంగా మారింది అనే ఫీలింగ్‌లో ఉంటాడు చరణ్. ఎడబాటు తగ్గుతుందని పల్లవి ఉద్యోగం మాన్పించాలని అనుకొంటాడు. దాంతో వారి మధ్య విభేదాలు చోటుచేసుకొంటాయి. ఈ క్రమంలో వారి జీవితాల్లోకి సెక్యూరిటీ ప్రవేశిస్తాడు..


పల్లవి, చరణ్ మధ్య చోటుచేసుకొన్న విభేదాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి. వారి జీవితంలో ఏలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఇంతకు పల్లవి ఉద్యోగం మానేసిందా? లేదా చరణ్ మారాడా? లేక వారి మధ్య సమస్యకు ఎలాంటి కారణం దొరికింది? వారి జీవితాలకు సెక్యూరిటీ సిబ్బంది ఎలాంటి ముప్పుగా మారాడు? అనే ప్రశ్నలకు సమాధానమే కుటుంబ కథా చిత్రం.


కుటుంబ కథా చిత్రం ఓ ప్రయోగాత్మక చిత్రం. కథను మడతల్లో చుట్టి స్క్రీన్ ప్లేతో తెర మీద మ్యాజిక్ చేయడమనేది ఇలాంటి చిత్రాల ఉద్దేశం. ఇలాంటి కథలను చెప్పడం తల పండిన దిగ్గజాలకే కత్తి మీద సాము. ప్రేక్షకులకు నచ్చకపోతే ప్రయోగం విఫలమైనట్టే. అలాంటి కథలో నందు, శ్రీముఖి, కమల్ కామరాజు, ఓ పాప (శ్రీముఖి, నందు కూతురు) కోణాల్లో చెప్పిన కలల కథ.


కేవలం ఈ నాలుగు పాత్రల మధ్య జరిగిన మానసిక ఘర్షణయే ఈ సినిమాకు తుది రూపం. సినిమా ముగిసిన తర్వాత స్క్రిప్ట్ రాసుకున్న తీరు బ్రహ్మండంగానే అనిపిస్తుంది. సినిమా చూస్తున్న ఏదో తెలియని అసౌకర్యం. అసంతృప్తి. కథను సినిమా ఫార్మాట్‌కు దూరంగా చెప్పడమే దర్శకుడి వైఫల్యం. ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్ లా ఉంటుంది పరిస్థితి


చరన్ పాత్రలో నందు కన్విన్స్‌గా నటించాడు. పాత్రలో చాలా వేరియేషన్స్ చూపించడంలో సఫలమయ్యాడు. నందుకు చాలా కాలం తర్వాత నటించడానికి వీలున్న పాత్ర దొరికింది. తన పాత్రకు నందు పూర్తిగా న్యాయం చేశాడు. నటనలో లోపాలు వెతుకాల్సిన ఛాన్స్‌ను నందు ఇవ్వలేదని చెప్పవచ్చు.శ్రీముఖికి కూడా చాలా ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆమె చేసిన పాత్రలన్నీ చిన్న చితక పాత్రలే. కుటుంబ కథా చిత్రంలో సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ప్రతీ ఫ్రేమ్‌లో ఉండే పూర్తిస్థాయి క్యారెక్టర్‌ను శ్రీముఖి పోషించింది. పాత్ర స్వభావాన్ని అర్థం చేసికొని పల్లవికి రోల్‌కు న్యాయం చేసింది. శ్రీముఖికి కెరీర్‌కు ఈ సినిమా పెద్దగా ఉపయోగపడకపోయినా.. భారమైన పాత్రలను అవలీలగా పోషిస్తుందని చెప్పుకోవడానికి పల్లవి పాత్ర సహకరిస్తుంది.కమల్ కామరాజుకు కూడా చాలా రోజుల తర్వాత పుల్‌లెంగ్త్ రోల్ దక్కింది. తన శక్తి సామర్థ్యాల మేరకు నెగిటివ్ క్యారెక్టర్‌లో రాణించాడు. కాకపోతే పాత్ర రియాక్షన్‌లో అతి ఎక్కువగా కనిపిస్తుంది. అది మినహాయిస్తే కమల్ కామరాజు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఏ పాత్రను తప్పుపట్టనక్కర్లేదు. కథ, కథనంలో ఉండే పరిమితుల కారణంగానే కొన్ని లోపాలు కనిపిస్తాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa