రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' సినిమా రూపొందింది. విభిన్నమైన కాన్సెప్ట్ తో నిర్మితమైన ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ .. తాన్యా హోప్ కథానాయికలుగా కనిపించనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా నుంచి ఈ నెల 6వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. జనవరి 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఆయనతో తలపడే ప్రతినాయకుడిగా బాబీసింహా కనిపించనున్నాడు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు సమానంగా వుండే ఈ సినిమా, రవితేజ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa