ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్రమ్ లేటెస్ట్ మూవీ టైటిల్ 'అమర్'...!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2019, 05:16 PM

 నటుడు విక్రమ్ రీసెంట్ గా మిస్టర్ కేకే చిత్రంతో పలకరించిన ప్రస్తుతం అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తన 58వ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఈ చిత్రంలో విక్రమ్ 20 పాత్రలలో కనిపించనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. వయాకామ్ 18, 7 స్క్రీన్స్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమాతో వెండితెరకి పరిచయం కానున్నాడు. కేఎస్ రవికుమార్, ప్రదీప్ రంగనాథన్ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో విడుదల కానున్న ఈ సినిమాకి అమర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.ఈ క్రిస్మస్‌కి ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నారట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa