అల్లు శిరీష్ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కించిన 'ఒక్క క్షణం'కు అడ్డంకులు తొలిగిపోయాయి. ఇటీవల విడుదలైన 'ఒక్క క్షణం' టీజర్‌ను చూసిన నిర్మాత అనిల్ సుంకర.., "ఈ చిత్రం కొరియన్ సినిమా 'పార్‌లల్ లైఫ్'ను పోలి ఉందని.. ఆ మూవీ రీమేక్ రైట్స్‌ను తాము తీసుకొని '2 మేమిద్దరం' అనే సినిమాను తెరకెక్కిస్తున్నామని, దీనిపై తమకు క్లారిటీ కావాలని" అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఒక్క క్షణం దర్శకుడు వీఐ ఆనంద్, నిర్మాత చక్రి అనిల్ సుంకరను కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపిన అనిల్ సుంకర.., "వీఐ ఆనంద్, చక్రిలతో మాట్లాడాను. ఈ సినిమా విషయంలో నాకున్న అనుమానాలు తొలిగిపోయాయి. 'ఒక్క క్షణం' కంటెంట్ విన్న తరువాత ఇది కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. అల్లు శిరీష్, వీఐ ఆనంద్‌లకు ముందుగానే శుభాకాంక్షలు. భవిష్యత్‌లో మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను" అంటూ తెలిపారు. దీంతో ఈ మూవీ విడుదలకు వచ్చిన అడ్డంకి తొలిగిపోయినట్లైంది. ఇక 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం త్వరలోనే సెన్సార్ ముందుకు వెళ్లనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa