దర్శకుడు మారుతీ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్..రాశీఖన్నా..సత్యరాజ్ ప్రధానపాత్రలను పోషిస్తున్నా సినిమా 'ప్రతిరోజూపండగే'. తాజాగా మరో లిరికల్ సాంగ్ వీడియోని రిలీజ్ చేశారు ప్రతిరోజూపండగే చిత్ర యూనిట్. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాట ప్రతీ ఒక్కరికి తమ చిన్నతనాన్ని గుర్తుచేయడం ఖాయం. తమన్ సంగీతం అందించిన ఈ పాటని జేసుదాసు తనయుడు విజయ్ ఏసుదాసు ఆలపించారు. `చిన్నతనమే చేరరమ్మంటే.. ప్రాణం నిన్నవైపే దారితీస్తోందే.అడుగుతై ఎదరికైనా నడకమాత్రం వెనకకే.. గడిచిపోయిన జ్ఞాపకాలతో గతము ఎదురౌతున్నదే." అంటూ సాహిత్య సవ్యసాచి సిరివెన్నెల కలం నుంచి జాలువారిన పదాలు చిన్ని తనంలోని మాధుర్యాన్ని.. మధుర జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చేలా వున్నాయి. ఈ సాహిత్యానికి తోడు తమన్ సంగీతం కూడా తోడవ్వడంతో పాటకు మరింత ప్రాణం పోసినట్టయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa