అరుంధతి , భాగమతి , రుద్రమ్మదేవి, వంటి సినిమాలతో అనుష్క అదరకోటింది. అయితే `భాగమతి` తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క నటించిన తాజా చిత్రం `నిశ్శబ్దం`. తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం విడుదలవుతోంది. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని `నిన్నే నిన్నే..` అంటూ సాగే పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. భాస్కరభట్ల రాసిన ఈ పాటను లేటెస్ట్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa