రాశి ఖన్నా నిదానంగా ఒక్కో హిట్ ను తన ఖాతాలో వేసుకు వెళుతున్న, తాజాగా ప్రతిరోజూ పండగే సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దాంతో ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లతో ముందుకు వెళుతోంది. ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకుపోతుండటం పట్ల రాశి ఖన్నా ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ సినిమాలో తను పోషించిన ఏంజిల్ ఆర్ణా పాత్ర జనంలోకి బాగా వెళ్లిందనీ, ప్రస్తుతం తను ఎక్కడికి వెళ్లినా అంతా ఏంజిల్ ఆర్ణా అనే పిలుస్తున్నారని అంటోంది. పల్లెటూరి అమ్మాయిగా తనని తాను తెరపై చూసుకోవడం థ్రిల్లింగ్ గా ఉందనీ, ఈ పాత్ర తనకి తెచ్చిపెట్టిన పేరు ఎంతో ఆనందాన్నిస్తోందని చెబుతోంది. తనకి ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకి కృతజ్ఞతలు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa