ఆది పుట్టినరోజును పురస్కరించుకొని మరో మూడు చిత్రాలు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. వాటిలో ఒకటి శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో రూపొందనున్న ‘శశి’ కాగా ఇంకొకటి జిబి.క్రిష్ణ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రం. ఈ చిత్రాన్ని మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి మొదలుకానుంది. ఇక మూడవ చిత్రం నూతన దర్శకుడు శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో ఉండనుంది. ఈ చిత్రాన్ని మరుధూరి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. 2020లో ఈ మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి 2019లో విడుదలైన మూడు చిత్రాలతో విజయం తీరం చేరని ఆది, 2020లో రానున్న మూడు చిత్రాలతోనైనా హిట్ అందుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa