2109 సంవత్సరం విక్టరీ వెంకటేష్‌కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ఏడాది మొదట్లో ఎఫ్2 అనే మల్టీ స్టారర్‌తో వెంకీ ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించింది. ఇక రీసెంట్‌గా తన సొంత మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమా చేశాడు వెంకటేష్. బాబీ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. రియల్ మామ అల్లుళ్ళు తొలిసారి రీల్ లైఫ్‌లోను మామ, అల్లుళ్ళుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే సరికి ప్రేక్షకులు సినిమాపై మంచి ఆదరణ చూపించారు. తాజాగా వెంకటేష్ దివ్యాంగుల కోసం ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ షోకి వెంకటేష్ కూడా హాజరయ్యారు. వెంకీని కలిసిన పిల్లలు చాలా ఎమోషనల్ అయ్యి ఆయనని ఆలింగనం చేసుకున్నారు. వెంకీ కూడా వారిని దగ్గరకి తీసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా కొన్ని గిఫ్ట్స్ కూడా అందించారు. వెంకటేష్ చూపించిన ఈ ప్రేమని చూసి తెగ మురిసిపోయారు ఆ చిన్నారులు. వెంకీ మామ చిత్రంలో నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటించగా, వెంకటేష్‌కి జతగా పాయల్ రాజ్‌పుత్ జోడి కట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa