హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో హీరో మహేశ్ బాబు ఫొటో షూట్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఫోటో షూట్ ను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో బారికేడ్లు విరిగిపోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సమాచారమిచ్చింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa