ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు , సూపర్‌స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నవిషయం విదితమే. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర పాత్రల్లో నటిస్తుండగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్ర కోసం విలక్షణ నటుడు జగపతిబాబును సంప్రదించడం, ఆయన అంగీకరించడం చకచకా జరిగిపోయాయని సమాచారం. ప్రస్తుతం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ శుక్రవారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని యూనిట్ వర్గాలు చెపుతున్నాయి. ఈ రెండో షెడ్యూల్‌లో జగపతి బాబు కీలక షాట్లు తీస్తారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం .. రిచర్డ్ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చంద్ర శేఖర్ రావిపాటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa