బాలీవుడ్ నటి కరీనాకపూర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాల్సి వచ్చిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని ప్రత్యేక పాత్రలు పోషించాల్సి వచ్చిన సందర్భంలో మేకప్ టెస్ట్‌లు చేస్తుంటారు. ఎందుకంటే నటిగా ఓ స్థాయిలో ఉంది. అనేక పాత్రల్లో నటించి మెప్పించింది. అయినప్పటికీ స్క్రీనింగ్ టెస్ట్ అమీర్ ఖాన్ కోసం చేశానని ఈ ముద్దుగుమ్మ అంటోంది. వీరిద్దరు కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్త్తున్నారు. అమీర్ ఖాన్ సినిమా కాబట్టి అలా చేయాల్సి వస్తుందని నిజాయితీగా ఒప్పుకుంది. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. దక్షిణాది నటుడు విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్ర చేస్తుండడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa